Monday, December 23, 2024

అదరగొడుతున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ అన్నింటిలోనూ జయకేతనం ఎగుర వేసింది. తొలి మ్యాచ్ నుంచే రాజస్థాన్ అసాధారణ ఆటతో చెలరేగి పోతుంది. ఆరంభ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ జట్టును ముందుండి నడిపించాడు.

రియాన్ పరాగ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాజస్థాన్ జయభేరి మోగించింది. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జయకేతనం ఎగుర వేసింది. అంతేగాక ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా బెంగళూరుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. ఇలా నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News