Sunday, December 22, 2024

చెప్పుల దండతో అభ్యర్థి ప్రచారం?!

- Advertisement -
- Advertisement -

అలీగఢ్: కాళ్లకు వేసుకునే చెప్పులను ఎవరైనా దండగా మార్చుకుని మెడలో వేసుకుంటారా? కానీ ఓ రాజకీయ నాయకుడు రోజుకో చెప్పుల దండతో ప్రచారం చేస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు చెప్పుల దండ వేసుకుని మరీ వస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో ఇదో వెరైటేనని చెప్పాలి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ నియోజకవర్గం నుంచి పండిట్ కేశవ్ దేవ్ స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల గుర్తుగ ‘చెప్పు’ వచ్చింది. అలీగఢ్ పోలింగ్ ఏప్రిల్ 26న జరుగనున్న నేపథ్యంలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన చెప్పు గుర్తును విస్తృతంగా ప్రచారం చేసే ఉద్దేశ్యంతోనే ఆయన రోజూ చెప్పుల దండతో ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆయన అలీగఢ్ లో చర్చనీయాంశం అయిపోయాడు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ చెప్పులతోనే కొట్టండి అంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నాడు. పనిచేయని ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలని కూడా అంటున్నారు.  ఆయన వింత ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News