- Advertisement -
చెన్నై: ఇటీవలి కాలంలో రాజకీయ ప్రసంగాలలో మహిళలను ఉద్దేశించి ఉపయోగిస్తున్న భాష పట్ల ఆధ్మాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సమాజం బాగు కోసం అటువంటి భాషను ఉపయోగిస్తున్న వ్యక్తులను నిషేధించాలని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు.
గత రెండు వారాలుగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో మహిళల గురించి ఉపయోగిస్తున్న భాషలో రేట్ కార్డు, తల్లిదండ్రుల గురించి ప్రశ్నలు, ఒక 75 ఏళ్ల మహిళ గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు వంటివి వినిపిస్తున్నాయని సద్గురు తెలిపారు. మనకు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులను నిషేధిస్తే మంచిదని ఆయన మీడియాకు, ప్రభావశీలురకు పిలుపునిచ్చారు. మహిళల పట్ల మన వైఖరిలో మార్పు రావాలని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -