Friday, October 18, 2024

అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: గడచిన నెలరోజులుగా కనిపించకుండా పోయిన ఒక 25 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం క్లీవ్‌ల్యాండ్ నగరంలో లభించింది. భారతీయులకు సంబంధించి అమెరికాలో ఈ తరహా ఘటన జరగడం ఈ వారంలో ఇది రెండవది. హైదరాబాద్‌లోని నాచారంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటిలో మాస్టర్స్ చదివేందుకు గత ఏడాది మే నెలలో అమెరికాకు వచ్చారు. గాలింపు చర్యలు జరుగుతున్న సమయంలో మొహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ మృతదేహం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో లభించినట్లు తెలుసుకుని బాధపడుతున్నానని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ఫత్ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్ఫత్ మరణంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించవలసిందిగా స్థానిక పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.

మార్చి 5వ తేదీన రిజర్వ్ స్కేర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరిన అర్ఫత్ తిరిగి రాలేదని స్థానిక పత్రికలు గత వారం తెలిపాయి. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయతే అర్ఫత్ తమ యూనివర్సిటీలో 2024 జనవరి 24 నుంచి విద్యార్థి కాదని క్లివ్‌ల్యాండ్ స్టే యూనివర్సిటీ తెలిపింది. అతను యూనివరిటీ క్యాంపస్‌లో ఉండలేదని కూడా తెలిపింది. ఇలా ఉండగా..మార్చి 7న అర్ఫత్ చివరిసారిగా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు అర్ఫత్ తండ్రి మొహమ్మద్ పలీం తెలిపారు. ఆ తర్వాత నుంచి అతనితో సంబంధాలు తెగిపోయాయని, అతని మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉందని ఆయన చెప్పారు.

గత వారం ఓహియోలో చదువుకుంటున్న ఉమా సత్య సాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ కేసును కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలలో 34 ఏళ్ల భారతదేశానికి చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే నాట్య కళాకారుడు సెయింట్ లూయిస్ మిస్సౌరీలో హత్యకు గురయ్యాడు. గత నెలలో బోస్టన్‌లో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి అభిజీత్ పరుచూరు మరణించాడు. ఫిబ్రవరి 5న పర్డూ యూనివర్సిటీకి చెందిన సమీర్ కామత్ అనే ఇండియన్-అమెరికన్ విద్యార్థి మరణించాడు. ఈ మరణాలన్నీ అమెరికాలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News