Monday, December 23, 2024

రాశి ఫలాలు(10-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు.

వృషభం – ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుండి ధన లాభాలు. సాంకేతిక విద్యావకాశాలు.

మిథునం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు.

కర్కాటకం – పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు.

సింహం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.

కన్య – శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తు సేకరణ.

తుల – పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు.

వృశ్చికం – కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగవకాశాలు పొందుతారు.

ధనుస్సు – కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు  దక్కించుకొంటారు.స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం – ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News