Friday, January 3, 2025

వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ముందు వైసిపికి షాక్ తగిలింది. హిందూపురం ముఖ్యనేత, వైసిపి ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఇక్బాల్ కు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

గతవారమే ఇక్బాల్.. వైసిపి పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక్బాల్ కంటే మందు పలువురు వైసిపి నాయకులు టిడిపిలో జాయిన్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించి అధికారంలొకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు.. జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News