Friday, December 20, 2024

పోటీ చేద్దామనుకున్నా కుదరలేదు: కేంద్ర మంత్రి అథావలె

- Advertisement -
- Advertisement -

నాగపూర్: మహారాష్ట్రలోని షిరిడీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ఆశించానని, అయితే పొత్తు ఒత్తిళ్ల కారణంగా అది సాధ్యం కాలేదని ప్రముఖ దళిత నాయకుడు, కేంద్ర సాజామిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావలె తెలిపారు. ఏదేమైనప్పటికీ ఎన్‌డిఎలోనే కొనసాగాలని తన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పిఐ) కార్యకర్తలు చెప్పారని, అంతేగాక కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండు చేశారని బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ అథావలె తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆసక్తితో షిరిడీ సీటును తన కోసం అడిగానని ఆయన చెప్పారు. అయితే షిరిడీ స్థానంలోని తన పారీకి చెందిన సిట్టింగ్ ఎంపి సదాశివ్ లోఖండేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన సారథి ఏక్‌నాథ్ షిండే హామీ ఇచ్చారని, దీంతో ఆ సీట్ల పొత్తు కుదరలేదని రాజ్యసభ సభ్యుడైన అథావలె చెప్పారు.

ఎన్‌డిఎలోనే ఉండి కేంద్ర మంత్రి పదవి కోసం డిమాండు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌పిఐ కార్యకర్తలు తనకు సూచించారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను ఉప ముఖ్యుమంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించానని ఆయన చెప్పారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందంటూ కాంగ్రెస్ వదంతులను సృష్టిస్తోందని ఆయన చెప్పారు. అటువంటి వదంతులను పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలే జరిగితే తాను రాజీనామా చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News