Sunday, January 19, 2025

టూవీలర్‌ను కారు ఢీకొని ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మదురైలో దుర్ఘటన

మదురై (తమిళనాడు) : మదురైలో బుధవారం ఒక కారు అదుపు తప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఎగిరి పలు అడుగుల దూరంలో పక్క లేన్‌పై పడినప్పుడు ఒక కుటుంబ సభ్యులు నలుగురితో సహా ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కారు దళవాయిపురం వెళుతోంది. విరుధునగర్, తిరుమంగళం నాలుగు లేన్‌ల రహదారిలో శివరకోట్టై వద్ద తన మార్గం వైపు వచ్చిన ఒక ద్విచక్ర వాహనం రైడర్‌ను ఢీకొనకుండా నివారించేందుకు కారు డ్రైవర్ విఫల యత్నం చేశాడు.

ఒక పండ్ల వర్తకుడు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ‘అకస్మాత్తుగా బ్రేకులు వేసిన ఫలితంగా కారు అదుపు తప్పి, పండ్ల వర్తకుని ఢీకొని, మీడియన్‌లోకి దూసుకుపోయి, పైకి ఎగిరి పక్క లేన్‌లో పడింది’ అని పోలీసులు వివరించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. వారిని మదురైలోని విల్లాపురానికి చెందిన కనకవేల్ (62), అతని భార్య కృష్ణకుమారి (58), ఆయన కోడలు నాగజ్యోతి (28), అతని ఎనిమిది సంవత్సరాల మనవడుగా గుర్తించారు. పండ్ల వర్తకుడు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు, అతనిని 55 ఏళ్ల పాండిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News