Monday, December 23, 2024

నకిలీ సిగరెట్ల స్మగింగ్ గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

రూ.2 కోట్లు విలువైన వివిధ బ్రాండ్లు స్వాధీనం

నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో ఈ కేటుగాళ్లునకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు తెర లేపగా గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో రూ.2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్ కు చెందిన సిగరెట్స్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు.ఈ కేసులో బీహార్ కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరోకరు పరారీలో ఉన్నారు.

బీహార్ రాష్ట్రం నుండి పాట్నా మీదుగా హైదరాబాద్ కు ఓ భారీ కంటైనర్ లో సిగరెట్స్ ఎక్స్ పోర్ట్ చేసి హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీరామ ఇంటర్ ప్రైజెస్ పేరు మీద డెలివరీ అడ్రస్‌కు పంపించారు. దీంతో శ్రీరామ్ ఇంటర్ ప్రైజెస్ చిరునామా ఆధారంగా పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్ కు కెటుగాళ్లు జిపిఆర్‌ఎస్‌ను పిక్స్ చే మరి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో ఎంత కాలం నుండి ఈ దందా కొనసాగుతుంది అనే అంశంపై పోలీసులు కూపి లాగుతున్నారు. ఈ నకిలీ సిగరెట్లు ఏ రాష్ట్రలకు తరలించారనే పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News