Sunday, January 5, 2025

సైనిక్ స్కూళ్ల ప్రైవేటీకరణ ఆపండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇందుకు సంంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన తన లేఖలో డిమాండు చేశారు. భారతీయ ప్రజాస్వామ్యంలో సాయుధ దళాలు రాజకీయాలకు అతీతంగా ఉండడం సాంప్రదాయంగా వస్తోందని, కాని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ గొప్పసాంప్రదాయాన్ని ముక్కలు చేసిందని తన రెండు పేజీల లేఖలో ఖర్గే పేర్కొన్నారు.

ఒక్కో వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వెళుతున్న ఆర్‌ఎస్‌ఎస్ తన భారీ కుట్రలో భాగంగా ఇప్పుడు సాయుధ దళాలనే దెబ్బతీసేందుకు పూనుకుందని, తన భావజాలాన్ని అటువంటి సంస్థలలో రుద్దడం వల్ల సైనిక పాఠశాలల జాతీయ స్వరూపమే దెబ్బతినే ప్రమాదముందని ఖర్గే పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకుని ఇప్పటికే కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News