Monday, December 23, 2024

మాల్దీవుల అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మాలె: ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుకు, అక్కడి ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శుభాకాంక్షలు తెలియచేశారు. రెండు దేశాల మధ్య ఎంతోకాలం నుంచి కొనసాగుతున్న సాంస్కృతిక, నాగరిక అనుబంధాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. శాంతియుత, సమీకృత ప్రపంచ నిర్మాణానికి అవసరమైన కరుణ, సోదరభావం, సమైక్యతా విలువలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఈద్ ఉల్ ఫితర్‌ను జరుపుకోవాలని ప్రధాని మోడీ తన సందేశంలో ఆకాంక్షించారు.

కాగా..మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. చైనా అనుకూలుడిగా భావిస్తున్న ముయిజ్జు తమ దేశం నుంచి భారతీయ సైనిక సిబ్బందిని పంపించివేస్తామని ఎన్నికలలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చేపట్టిన చర్యలు ఉభయదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News