ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాలను చేర్చడానికి
ప్రత్యేక కమిటీలు ఇందిరమ్మ
కమిటీ సభ్యులకు రూ.6వేల
గౌరవ వేతనం జూన్ మొదటి
వారంలో స్థానిక ఎన్నికలు
మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైనే
దృష్టి భువనగిరి, నల్లగొండ
పార్లమెంట్ నియోజకవర్గాల
సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి
12 నుంచి ప్రజల్లోకి…
ప్రచారం ఉధృతం చేయడానికి పార్టీ
నిర్ణయం 17 నియోజకవర్గాల్లో
జరిగే నామినేషన్ల సమర్పణకు
సిఎం హాజరు వచ్చే నెలలో
మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో
ప్రియాంక సభలు సమావేశ
అనంతరం కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి వెల్లడి
భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట. ఈ టికెట్‌ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించినా అధినాయకత్వం ఎవరికి ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తామని ప్రకటించింది. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తున్నా.
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నటి కాంగ్రెస్ భువనగిరి. నల్గొండ స్థానాల పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.అందులో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మునుగో డు ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూ హాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 12వ తేదీ నుంచి ఎన్నికల ప్ర చారాన్ని మరింత ఉ ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని సిఎం ప్ర కటించారు. ప్రతి కమిటీ స భ్యుడికి ఆరు వేల గౌరవ వేతనం అందిస్తామని ఆ యన చెప్పారు. జూన్ మొదటి వారంలో స్థాని క సంస్థల ఎన్నికలన నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత ఇక నాలుగేళ్లు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెడుతామని ఆయన కాంగ్రెస్ నేతల కు వివరించారు. కాగా జనగామలో మనకు ఎంఎల్‌ఎ లేరని అధైర్యపడొద్దని పా ర్టీ నేతలకు ధై ర్యం చెప్పారు. ఆ సెగ్మెంట్ పరిధిలో నే చామల కిరణ్‌కు భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గెలుపుకోసం ప్రతి ఒక్కరూ శక్తి వం చన లేకుండా పనిచేయాలని సూ చించారు. కాం గ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను, ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట అని అన్నా రు. ఈ టికెట్ ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించి నా అధినాయకత్వం ఎవరికి ఇచ్చినా గెలుపుకో సం కృషి చేస్తామని కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే తాను ఇక్కడికి వ చ్చానని చెప్పారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తున్నట్టు పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనగామ కో-ఆర్డినేషన్ బాధ్యతను డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చూసుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతాననని ఆయన చెప్పారు. తనతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఎఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకే రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రెండు సభలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
నల్లగొండ సెగ్మెంట్ పరిధిలోని మిర్యాలగూడలో ఉదయం, భువనగిరి సెగ్మెంట్ పరిధిలోని చౌటుప్పల్ లో సాయంత్రం సభ నిర్వహించేందుకు యోచిస్తున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ వేసిన రోజు అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.