Saturday, December 21, 2024

హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వ్యాపార భాగస్వామ్యంలో సుమారు రూ. 4.3 కోట్ల మోసం చేసిన క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యాల సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2001లో బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్ కు 20శాతం వాటా ఉంది. కాగా, అతను తన పార్టనర్స్ తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం ప్రారంభించాడు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ. 4.3 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News