ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పని చేయవచ్చు. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం. ఎఎస్‌డి అనేది అభివృద్ధి క్రమరాహిత్యం, ఇది సామాజికంగా కమ్యూనికేట్ చేయడానికి, ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని మూలం సాధారణంగా జన్యుపరమైనది అయినప్పటికీ, ఎఎస్‌డికి ఎటువంటి చికిత్స లేదు. అయినప్పటికీ, ముఖ్యమైన జీవనశైలిలో మార్పులు అమలు చేయడం ద్వారా పిల్లల్లో ఈ సమస్య మరింత పెరగకుండా చర్యలు తీసుకోవచ్చు.
కొందరు పిల్లలు చురుకుగా వ్యవహరించకుండా.. ఎవరితోనూ కలవకుండా.. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, సరిగా మాట్లాడలేకపోతుండడం వంటి లక్షణాలు కలిగి ఉండడాన్ని మందబుద్ధి.. ఆటిజం అని పిలుస్తారు. తల్లి దగ్గరకు తీసుకుంటున్నప్పటికీ.. చిన్నారి సరిగా స్పందించకపోవడం ఆటిజం మరో లక్షణం. శిశువుకు 3 నెలలు వచ్చినప్పటినుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో కళ్లుపెట్టి నవ్వితే నవ్వుతారు.అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది. కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. మన దేశంలో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆటిజం అనేది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మతల్లో ఒకటి.
ఇది అనేక రకాల లక్షణాల ద్వారా బయటపడుతుంది. నిద్రలేమి, స్వీయ-గాయాల వంటి సమస్యాత్మక ప్రవర్తనలతో పాటు, ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను కలిగి ఉంటారు. పిల్లల్లో మంద బుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రపంచ ఆటిజం అవగాహనా దినం నిర్వహిస్తున్నారు. ఆటిజం అనేది బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మత, ఇది జాతి, సామాజిక ఆర్థిక లేదా లింగ భేదాలు లేని రుగ్మత. ‘ఆటిజం స్పెక్ట్రమ్‘ (ఎఎస్‌డి) అనే పదం విస్తృతమైన లక్షణాలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఆటిజంతో బాధపడుతున్నవారు సమానమైన చికిత్స పొందేందుకు, ఒకే రకమైన సహాయం పొందేందుకు హక్కును కలిగి ఉంటారు. ఆటిజంపై అవగాహనతో వారికి సమాజం పూర్తిగా సహకరించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల నైపుణ్యాలు, అవసరాలు కాలక్రమేణా మారవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పని చేయవచ్చు.
మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం. ఎఎస్‌డి అనేది అభివృద్ధి క్రమరాహిత్యం, ఇది సామాజికంగా కమ్యూనికేట్ చేయడానికి, ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని మూలం సాధారణంగా జన్యుపరమైనది అయినప్పటికీ, ఎఎస్‌డికి ఎటువంటి చికిత్స లేదు. అయినప్పటికీ, ముఖ్యమైన జీవనశైలిలో మార్పులు అమలు చేయడం ద్వారా పిల్లల్లో ఈ సమస్య మరింత పెరగకుండా చర్యలు తీసుకోవచ్చు. తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరోవైపు గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, ముఖ్యంగా భారీ లోహాలు, పర్టిక్యులేట్ పదార్థాల ప్రభావానికి గురికావడం ఎఎస్‌డి ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కాబోయే తల్లులు వారి ప్రినేటల్ అపాయింట్మెంట్లకు క్రమం తప్పకుండా హాజరు కావడం, కడుపులోని బిడ్డ ఎదుగుదల క్రమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి ఎఎస్‌డి ఉన్నట్లు నిర్ధారణ అయితే, ముందస్తు చర్యల ద్వారా వారి కమ్యూనికేషన్, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అవకాశముంది.
తల్లులు తమ శిశువులలో ఆటిజాన్ని నివారించడానికి అనేక చర్యలు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రినేటల్ చెక్- అప్లకు హాజరుకావడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామాలు చేయడం, హానికరమైన ప్రభావాలను నివారించడం. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలు తీసుకోవాలని, కడుపులో శిశువు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముందస్తు చర్యల్లో భాగమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానిత లక్షణాలు గుర్తిస్తే, తదుపరి పరీక్షల కోసం వాటిని ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి నివేదించడం చాలా అవసరం. ఈ చర్యల ద్వారా, తల్లులు తమ బిడ్డకు ఆటిజం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
దయ్యాల అశోక్, 95508 89907