Monday, November 25, 2024

బిజెపికి ఓమర్ అబ్దుల్లా సవాల్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: సత్తా ఉంటే కశ్మీరు లోయలోని లోక్‌సభ స్థానాల నుంచి సొంతంగా పోటీ చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సి) జాతీయ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా శుక్రవారం బిజెపికి సవాలు విసిరారు. బిజెపి అభ్యర్థ్లుల డిపాజిట్లు గల్లంతు కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు చేశారు. అభివృద్ధి, శాంతి మంత్రం జపిసుఓ్తన్న బిజెపి కశ్మీరు లోయలోని మూడు లోక్‌సభ స్థానాలకు తన అభ్యర్థులను నిలబెట్టాలని శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన డిమాండు చేశారు.

బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి ఓమర్ అబ్దుల్లా, శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ పోటీ చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ఎన్‌సి ప్రకటించింది. జమ్మూ కశ్మీరులో ఎన్‌సి, పిడిపి, కాంగ్రెస్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని బిజెపి చేస్తున్న ఆరోపణను గురించి ప్రశ్నించగా దీనికి ప్రజలే సమాధానం ఇస్తారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అంత గొప్ప శక్తే ఉంటే బిజెపి అభ్యర్థులను నిలబెట్టి బిజెపి పేరిట ఓట్లు అడగాలని ఆయన సవాలు చేశారు.

370 అధికరణకు ఏం చేశారో, జమ్మూ కశ్మీరులో అభివృద్ధి, వాతావరణం గురించి ఏం చెబుతున్నారో వాటికే కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. బిజెపి అభ్యర్థులను నిలబెట్టి ఇవే మాటలతో ఓట్లు అడగాలని, మీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలని ఆయన చెప్పారు. ఎ, బి, సి టీములను తయారుచేయడానికి ప్రయత్నాలు మానుకోవాలని బిజెపికి ఆయన సూచించారు. ఎన్నో గొప్ప పనులు చేశామని మీరు చెప్పుకుంటున్నారు. మేము ఏమీ చేయలేదని మీరే చెబుతున్నారు.. అదే నిజమైతే ఈ ఎన్నికలలో మాకు డిపాజిట్లు కూడా దక్కకూడదు అని ఓమర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News