నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే నెలలో మరోసారి సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవిలో తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు కృష్ణానదీజలాల నుంచి 14టిఎంసిల నీటిని కేటాయించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు 8.5టిఎంసిలు , ఆంధ్రప్రదే శ్ రాష్ట్ర అవసరాలకు 5.5టిఎంసిల నీటిని కేటాయించా రు.శుక్రవారం జలసౌధలో కృష్ణానదీయాజమాన్యబోర్డు త్రి సభ్య కమిటి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపైనే సుమారు రెండుగంటల పాటు చర్చించి ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటి నిర్ణయించింది.
అందుబాటు లో ఉన్న 14 టిఎంసిలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్ కు 5.5 టిఎసిల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించా రు. వాస్తవానికి ఈ నెల నాలుగో తేదీన కమిటి సమావేశం జరగాల్సి ఉండగా, బోర్డు త్రిసభ్య కమిటిలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కానందున సమావేశాన్ని ఈ నెల 12కు వాయిదా వేసింది. కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డిఎం రాయిపురే నేతృత్వంలో జరిగిన త్రిసభ్య కమిటి సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపి ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కృష్ణానదిపై ఉ న్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు. 2023 అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్ప ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 45, తెలంగాణకు 35 టిఎంసి నీటిని కేటాయించగా, అందులో తమకు మరో ఐదు టిఎంసిల మిగులు నీరు ఉందని, తెలంగాణ అదనంగా ఏడు టిఎంసిలు వినియోగించుకొందని ఏపి ఈఎ న్సి నారాయణరెడ్డి కమిటీ ముందు వెల్లడించారు.
నాగార్జున సాగర్ నుంచి వెంటనే తమకు ఆ ఐదు టిఎంసిల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఏపి డిమాండ్‌ను తెలంగాణ వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సి అనిల్ బోర్డు త్రిసభ్యకమిటి ముందు వెల్లడించారు. అంతే కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపి ఇకనుంచి ఎటువంటి అవసరలకు కూడా నీటిని తీసుకోకుండా చూ డాలని బోర్డును కోరారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువన తమ రాష్ట్రం లో తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని ఏపి ఈఎన్సి నారాయణరెడ్డి సమావేశంలో వివరించారు.
నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత అధికంగా నీటిని అందజేయాలని కోరారు. దీనికి ప్రతిగా తెలంగాణలో కూడా తాగునీటి అవసరాలు అధికంగానే ఉన్నట్టు ఈఎన్సి అనిల్ కుమార్ సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్‌పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సి వివరించారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వులు , రెండు రాష్ట్రాల్లో వేసవి తాగునీటి అవసరాలను మరో మారు చర్చించేందుక మే నెలలో మరోమారు సమావేశం కావాలని నిర్ణయం త్రిసభ్యకమిటిలో నిర్ణయం తీసుకున్నారు.
సాగర్‌లో 510.30అడుగులకు నీటిమట్టం
కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో శుక్రవారం నాటికి నీటిమట్టాలు, నీటినిలువలను బోర్డు అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 510.30అడుగుల వద్ద 132.18టిఎంసిలు నిలువ ఉంది. ఎగువనుంచి రిజర్వాయర్‌లోకి 3426క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రిజర్వాయర్ నుంచి 7370క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 809.40అడుగుల వ ద్ద 33.96టిఎంసిల నీరు నిలువ ఉంది.
ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి నీ టి ప్రవాహాలు పూర్తిగా అడుగంటాయి .రిజర్వాయర్ నుంచి 1334క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. జూరాల ప్రాజెక్టులో నీటినిలువ 3.08 టిఎంసిలు ఉండగా , ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు తుంగభద్ర ప్రాజెక్టులో కూడా నీటినిలువ 4.01టిఎంసిలకు పడిపోయింది. దిగువన ప్రకాశం బ్యారేజిలో 1.61టిఎంసిల నీరు ని లువ ఉంది. ఎవగు నుంచి 2083క్యూసెక్కుల నీరు చేరుతుండగా, బ్యారేజి నుంచి 2824క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు