Friday, December 20, 2024

పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి… తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ, కాంగ్రెస్‌సమాజ్ వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నాదళ్ కమలావాడి(ఎడీకె) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఏఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (పీడీఎం) కూటమిని ఏర్పాటు చేశారు.

ఈ కూటమి ఉత్తరప్రదేశ్ లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్‌బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ పేర్లు అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News