Saturday, April 12, 2025

యూట్యూబర్ జంట విషాదాంతం

- Advertisement -
- Advertisement -

ఏడవ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఏమైందో తెలియదు కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ సహజీవనపు యూట్యూబర్ యువజంట అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఉదయం రాజధాని ఢిల్లీకి కూతవేటుదూరంలోని హర్యానా బహద్దూర్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం ఏడవ అంతస్తు నుంచి వీరు కిందికి దూకారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని 25 ఏండ్ల గర్విత్, 22 ఏండ్ల నందినిగా గుర్తించారు.

ఈ ఇద్దరూ జంటగా ఉంటూ సహజీవన బందంలో ఉన్నారు. సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ , కాంటెంట్ క్రియేటర్స్‌గా ఉన్నారు. వీరు ఇటీవలే తమ బృందంతో కలిసి డెహ్రాడూన్ నుంచి బహద్దూర్‌గఢ్‌కు చేరారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఏదో విషయంపై వీరు గోడవకు దిగారని తరువాత పై నుంచి కిందికి దూకడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. మిగిలిన వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News