Friday, December 20, 2024

ఇంటికొచ్చి చంపేస్తా

- Advertisement -
- Advertisement -

మేయర్‌ను బెదిరించిన భారత సంతతి మహిళ

కాలిఫోర్నియా : స్థానిక అధికారులను చంపేస్తానని బెదిరించిన భారతీయ సంతతి మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద స్థాయిలో బెదిరింపులకు దిగిన ఈ మహిళను రిద్థి పటేల్‌గా గుర్తించారు. ఇటీవల కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్ నగర పాలక మండలి సమావేశం జరిగింది. ఈ దశలో ఈ మహిళ మేయర్‌ను ఉద్ధేశించి ఏకంగా చంపేస్తానని బెదిరించినట్లు నిర్థారణ అయింది.

అమెరికా పట్ల ఆమె ఆగ్రహానికి కారణం ఉంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో కాల్పుల విరమణ తీర్మానానికి అమెరికా మద్దతు ప్రకటించకపోవడం పట్ల ఆమె ఈ సిటీ కౌన్సిల్ సభలో మండిపడ్డారని వెల్లడైంది. మేయర్ ఇతర ఉన్నత స్థాయి వారు ఎందుకు దీనిపై స్పందించడం లేదని వారిని చంపినా పాపం కాదని చెప్పడం వివాదాస్పదం అయింది. చివరికి ఆమె అరెస్టుకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News