Friday, December 20, 2024

కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం భారత్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు ఈ కచ్చతీవు దీవుల ప్రాంతాల్లో చేపలు పట్టుకోవచ్చని. అయితే ఆ ఒప్పందం 1976 లో సవరణకు గురైందని తెలిపారు. ఆ సవరణ ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపలు పట్టుకోవడాన్ని నిషేధించినట్లు చెప్పారు.

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్య్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది.స్వాతంత్య్రం తర్వాత భారత్, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై వివాదం కొనసాగుతున్నది. కచ్చతీవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు. ఇండో శ్రీలంకన్ మారిటైం అగ్రిమెంట్ పేరుతో కచ్చతీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత జాలర్లు ఈ దీవి పరిధిలోని సముద్ర జలాల్లోనూ చేపల వేట సాగించొచ్చు.

కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనను పట్టించుకోలేదు. భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకొనేందుకే ఈ దీవికి రావొచ్చని, తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని వాదించింది. తమిళనాడు, శ్రీలంకకు మధ్యలో ఉన్న కచ్చతీవు దీవులు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం మన దేశంలో ఎన్నికలు జరగనున్న వేళ కచ్చతీవు అంశం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో శ్రీలంక స్పందించింది.కచ్చతీవు దీవులు తమవేనని స్పష్టం చేసింది. ఆ కచ్చతీవు దీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవానంద వెల్లడించారు.

1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు ఈ కచ్చతీవు దీవుల ప్రాంతాల్లో చేపలు పట్టుకోవచ్చని. అయితే ఆ ఒప్పందం 1976 లో సవరణకు గురైందని తెలిపారు. ఆ సవరణ ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపలు పట్టుకోవడాన్ని నిషేధించినట్లు చెప్పారు. 1976 లో జరిగిన ఒప్పందంలో భాగంగా సముద్రంలో సరిహద్దులు విభజించారని పేర్కొన్నారు. కన్యాకుమారికి దిగువన వెస్ట్‌బ్యాంక్ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉందని, ఎన్నో వనరులు ఉన్న ఆ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కచ్చతీవు దీవుల కంటే 80 రెట్లు పెద్దదని 1976 ఒప్పందం ప్రకారం అది భారత్‌కు దక్కింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 23 ఫిషింగ్ బోట్‌లను, సుమారు 200 మంది భారత మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసిన ప్రతిసారీ వారిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ లేఖలు రాస్తున్నారు.

వారి అరెస్టులను నరేంద్ర మోడీ అడ్డుకోవడంలేదని డిఎంకె నేతలు మండిపడ్డరు. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్, డిఎంకెలకు షాక్ ఇచ్చేందుకే కచ్చతీవు దీవుల అంశాన్ని ప్రధాని మోడీ, బిజెపి నేతలు తెరపైకి తెచ్చారని డిఎంకె నేతలు ఆరోపిస్తున్నారు. అంతక ముందు పెద్దగా పట్టించుకోని శ్రీలంక 2009 నుంచి కచ్చతీవు దగ్గర బలగాలను మోహరించి దీవి దగ్గరకువెళ్లే భారత జాలర్లను అరెస్టు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి. 2011లో నాటి తమిళనాడు సిఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు. అంతకముందు 2006లో నాటి డిఎంకె అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు.

2023లో తమిళనాడు ప్రస్తుత సిఎం, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోడీకి లేఖ రాశారు. బిజెపికి తమిళనాడులో అంతపట్టు లేనందున ఈ కచ్చతీవు వివాదం తెరపైకి తెచ్చి తమిళులను ఆకర్షించుటకు చేసిన ఎత్తుగానే కనిపిస్తుంది. 2014 నుండి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా ఎప్పుడు లేనిది ఇంతలా ఎన్నికల సమయంలో దీనిపై దృష్టి కేంద్రీకరించడంలో అర్థం ఏంటి? గత ప్రభుత్వం ఒప్పందంపై నిప్పులు చిమ్ముతున్నా, వెనుకదాగి ఉన్న కథనం ఏమిటి? అంటే తమిళనాడులో అధికారంలో ఉన్నా డిఎంకె, కాంగ్రెస్ ‘ఇండియా’కూటమిలో పొత్తులో భాగస్వామ్యం కావడంతో రాజకీయంగా వాటిని దెబ్బతీయడం కోసం అకస్మాత్తుగా తెరపైకి కచ్చతీవు వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

జాజుల దినేష్
9666238266

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News