నేడు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
కె.సి వేణుగోపాల్ హైదరాబాద్ రాక
సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి,
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల
ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో భేటీ
ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్
అభ్యర్థుల ఖరారుపై చర్చ
ఖమ్మం పీటముడి వీడిందంటున్న
పార్టీ వర్గాలు నేడో,రేపో
అభ్యర్థుల జాబితా విడుదల
ఎన్నికల వ్యూహంపైనా సాగనున్న
కసరత్తు తాజా పరిస్థితిని
వివరించనున్న వ్యూహకర్త కనుగోలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంపి ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పె డుతోంది. అందులో భాగంగా ఏఐసిసి ప్రధాన కా ర్యదర్శి కెసి వేణుగోపాల్ నేడు (ఆదివారం) హైదరాబాద్‌కు వస్తున్నారు. శంషాబాద్ నోవాటెల్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కెసి సమావే శం కా నున్నారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎం పి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 17 లోక్‌సభ స్థా నాల నియోజకవర్గం ఇన్చార్జీలు ఈ సమావేశానికి హా జరుకానున్నారు. కాంగ్రెస్ వ్యూహాకర్త సు నీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహాంపై వేణుగోపాల్ స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి ని సునీల్ కనుగోలు ఈ సమావేశంలో వివరించనున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రం లో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మినహా అ న్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిం ది. ఈ సమావేశంలో ఖమ్మం సీటుపైనా పీటము డి వీడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పే ర్కొంటున్నాయి. ఈ మూడు స్థానాలకు అభ్యర్థు ల విషయంలో చర్చలు తుదిదశకు చేరుకున్నాయ ని, నేడో, రేపో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకా శం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇంకా అ భ్యర్థులను ప్రకటించని (ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్) మూడు స్థానాలకు సంబంధించి అ భ్యర్థులకు సంబంధించి తుది జాబితాను కూడా నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వ ర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలో జరపాల్సిన స మావేశాన్ని హైకమాండ్ సూచనల మేరకు హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసిం ది. ముగ్గురు పెండింగ్ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ స మావేశం ఉన్నప్పటికీ దానికి బదులుగా ఏఐసిసి పెద్దల సూచనల మేరకు నేరుగా కెసి వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్టుగా తెలిసింది. ఖమ్మం. కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఇప్పటికే ఫైనల్ అయిన 14 స్థానాల అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ భేటీ కానున్నట్టుగా సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సా రి లోక్‌సభ సీట్లను ఎక్కువ గెలుచుకోవాలన్న లక్షంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడకు పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడంతో పాటు వారితో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల తుక్కుగూడలో జరిగిన సభకు పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరై మేనిఫోస్టో తెలుగు ప్రతిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రెండు భారీ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మి ర్యాలగూడలో, భువనగిరి పార్లమెంటరీ నియోజకవ ర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో ఒకే రోజు జరిగే ఈ సభ కు ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ హాజరవుతారని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రం లో ప్రచారానికి రానున్నారు.
దీనికితోడు ఏఐసిసికి చెందిన ముఖ్యనేతలు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే మంత్రులు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటరీ నియెజకవర్గాల వారీగా సిఎం సమీక్షలుపిసిసి చీ ఫ్ రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా మారిపోయారు. సిఎం రేవంత్ పార్లమెంటరీ నియెజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడం, కీలక నేతల ఇళ్లకు వెళ్లి దిశానిర్ధేశం చేయడంలో బిజీగా మారారు. అదే సమయంలో వివిధ పార్టీల వారిని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కీలక నేతలకు తన నివాసంలో కండువాలు కప్పుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని సూచిస్తున్నారు. అంతర్గత సమస్యలపైనా దృష్టి సారిస్తూ కలిసి పనిచేసేలా ఒక్కతాటిపైకి తెస్తున్నారు. ఏదీ ఏమైనా భారీ మెజార్టీతో 14 సీట్లతో విజ యం సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఖమ్మం సీటుపైనే ఉత్కంఠ..!
ఇదిలా ఉంటే హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు కంచుకోట. మళ్లీ మజ్లిస్ నుంచి అసదుద్దీన్ బరిలో ఉన్నారు. ఈ సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఇక్కడ మాధవీలతను బిజెపి పోటీలో దిం పింది. ఇక బిఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బిసి)ని బరిలోకి దింపారు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టె న్నిస్స్టార్ సానియామీర్జాను బరిలోకి దింపాలని కా్ంర గెస్ చూస్తోంది. ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక ఖమ్మంలో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ మంత్రుల బంధువులు బరిలోకి వచ్చారు. డిప్యూటీ సి ఎం భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారు డు పోటీ పడుతున్నారు. అలాగే మరో వ్యక్తి పేరు కూ డా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ సీటుపై కూడా తీవ్ర క సరత్తు చేస్తున్నారు. అయితే ఖమ్మం సీటుపైనే ఉత్కంఠ నెలకొందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.