Saturday, January 18, 2025

ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి….

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడులకు తెగపడింది. ఆ డోన్లు ఇజ్రాయెల్ చేరుకోవడానికి సమయం పడుతుండడంతో ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఇరాక్ గగనతలం మీది నుంచి ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్ది డ్రోన్లు ఎగురుతున్నట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. సిరియా, జోర్డాన్ మీదుగా వస్తున్న డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను కూడా అప్రమత్తం చేయడంతో గగనతల దాడికి సిద్ధం చేసింది. ఏప్రిల్‌లో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు సైనికాధికారులు చనిపోయారు. ఈ దాడి చేసి ఇజ్రాయెలేనని ఆరోపణలు చేయడంతో పాటు ఆ దేశాన్ని శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News