Saturday, December 21, 2024

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు

- Advertisement -
- Advertisement -

తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × లక్నో సూపర్ జెయింట్స్

రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్

కోల్ కతా:  ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్… రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి. కాగా, ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. ఆట నడుస్తోంది.

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ స్థానంలో బౌలర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. లక్నో జట్టులో దేవదత్ పడిక్కల్, నవీనుల్ హక్ ల స్థానంలో షామార్ జోసెఫ్, దీపక్ హుడాలకు తుది జట్టులో స్థానం లభించింది. మొహిసిన్ ఖాన్ కూడా జట్టులోకి వచ్చాడు.  కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, లక్నో జట్టు 5 మ్యాచ్ ల్లో 3 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News