Monday, December 23, 2024

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

టారా టొరాజా (ఇండోనేసియా) : ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని టానా టొరాజా జిల్లాలో చుట్టుపక్కలనున్న కొండల నుంచి మట్టి పెళ్లలు శనివారం అర్ధరాత్రి సమయంలో నాలుగు ఇళ్లపై కుప్పకూలాయని స్థానిక పోలీస్ చీఫ్ గునర్డి ముండు చెప్పారు. ఈ ఇళ్లలో ఒకింటి లోనే కుటుంబ సభ్యులంతా సమావేశమయ్యారని తెలిపారు.

మారుమూల కొండ ప్రాంతమైన మకాలే , దక్షిణ మకాలే గ్రామాల్లో సైనికులు, పోలీస్‌లు, వాలంటీర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారని ముండు తెలిపారు. ఆదివారం ఉదయం రక్షక దళాలు శిధిలాల కింద గాయపడిన ఇద్దరిని బయటకు తీసుకు రాగలిగారని, వీరిలో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని చెప్పారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మకాలే గ్రామంలో 11 మృతదేహాలను, దక్షిణ మకాలే గ్రామంలో 3 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా మూడేళ్ల బాలికతోసహా మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు విపత్తు యాజమాన్య సంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్ ముహరి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News