Tuesday, September 17, 2024

హైదరాబాద్ లో భారీగా నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని వివిధ ఎన్ఫ్‌ర్స్‌మెంట్ బృందాలు రూ.13,72,28,460 నగదు, కోటి 88 లక్షల 95 వేల 185 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 20,090.38 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 167 మందిపై కేసులు నమోదు చేసి 161 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 340 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 221 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 2,686 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు రోనాల్ రోస్ తెలిపారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 26,91,500 నగదు, 33,839 రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది 101.61 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 7 గురిపై కేసులు నమోదు చేసి 6 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 7 గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 93 లైసెన్స్ ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడి నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,94,76,740 నగదు, పోలీస్, ఐటి శాఖ ద్వారా రూ.10,61,72,030/ నగదు ఎస్.ఎస్.టి బృందాల ద్వారా రూ.15,79,690 నగదు సీజ్ చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News