Monday, January 20, 2025

వాంగ్మూలాలే కీలకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డిఎస్‌పి దుగ్యాల ప్రణీత్‌రావు కీలకమైన హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆ ధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పె షల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబి)తో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే ప నిలో నిమగ్నమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవ హారం నడిచిన సమయంలో ఎస్‌ఐబిలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది తో వాం గ్మూలాలు సేకరిస్తోంది. అలాగే క్షేత్రస్థాయి ఆప రేషన్లు, న గదు అక్రమ రవాణా తదితర అంశాలపై సిఐ గట్టుమల్లు సహా ఇతర పోలీసుల వాం గ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశం పై దర్యాప్తు అధికారులు నజర్ సారించారు. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి వాం గ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డి రాధాకిషన్‌రావుల ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈ వాంగ్మూలాల ద్వారా తేట తెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయమూర్తి ముందు పెట్టనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబి చీఫ్‌గా ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డిగా రాధాకిషన్‌రావులు ఆడిందే ఆటగా సాగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమమని తెలిసినా రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ యథేచ్ఛగా సాగిపోయిందని, ఆ ఇద్దరూ బాస్‌లు కావడంతో వారి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తూచా తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాలను బట్టి తెలుస్తోంది. గతంలో ఎస్‌ఐబిలో పనిచేసి ప్రసుత్తం సిఐడిలో ఉన్న ఓ ఇన్స్‌పెక్టర్ వాంగ్మూలాన్ని సైతం దర్యాప్తు బృందం సేకరించింది.

ఆయన ఎస్‌ఐబిలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు ప్రణీత్‌రావుల సూచనల మేరకు అనధికారిక నిఘా ఎలా కొనసాగిందో దర్యాప్తు బృందానికి కూలంకషంగా వివరించినట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు నేతృత్వంలో ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును అడ్డుకుని, ఎలా జప్తు చేశారనేది వెల్లడించినట్లు తెలిసింది. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ఇప్పుడూ అక్కడే ఉన్న మరో ఇన్స్‌స్పెక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఎనిమిది సార్లు ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును ఎలా పట్టుకోగలిగామనే విషయాన్ని విచారణలో వెల్లడించారని సమాచారం. రాధాకిషన్‌రావు తనను ఎలా ఏమార్చారనే అంశాన్ని టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఒకరు పూసగుచ్చినట్లు దర్యాప్తు బృందానికి వివరించారని చెబుతు న్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డికి సంబంధించిన నగదును ఎలా తరలించారు? ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్‌పికి డబ్బులు ఎలా చేర్చారు? అనే విషయాలు వెల్లడించారని తెలిసింది.

ప్రభాకర్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావు బృందం గులాబీ పార్టీ ప్రత్యర్థి నేతలకు చెందిన నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టడం, దాన్ని రాధాకిషన్‌రావుకు చేరవేయడం, వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవ డం.. ఇదీ ఫోన్ ట్యాపింగ్ దందా సాగిన తీరు. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆర్థిక వనరులు అందకుండా అడ్డుకోవడం ద్వారా భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతోనే ఇలా అడ్డదారిలో నిఘా అమలుపరిచినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైనట్లు సమాచారం . 2018 ఎన్నికల సమయంలో రాంగోపాల్ పేట ఠాణా పరిధిలో రూ.70 లక్షలు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బేగంపేటలో కోటి రూపా యలు, మునుగోడు ఉపఎన్నిక సమయంలో గాంధీనగర్‌లో మూడున్నర కోట్లు, అసెంబ్లీ ఎన్నికల వేళ గత ఏడాది అక్టోబరులో బంజారా హిల్స్‌లో రూ.3.35 కోట్లు, గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.22 లక్షలు, నగరంలోని మరోచోట రూ.15 లక్షలు, నారాయణగూడ ఠాణా పరిధిలో మరో రూ.49 లక్షలు, భవానీనగర్‌లో కోటి రూపాయలు ఇలా ఎనిమిది ఉదంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన రూ.10.41 కోట్ల నగదు రవాణాను అడ్డుకోగలినట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డి రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారని విశ్వసనీయ సమాచారం.

రాధాకిషన్ రావుపై నమోదైన కిడ్నాప్
కేసులోఎఫ్‌ఐఆర్‌లో ఓ నిర్మాత పేరు?
టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్‌లో నమోదైన కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసులో టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాత పేరును ఉందని, తాజాగా ఎఫ్‌ఐఆర్‌లో సదరు నిర్మాత పేరు చేర్చినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియాకు

పోలీసుల కీలక సూచన
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. ఇంకా ప్రధాన అనుమానితులు పరారీలో ఉన్నారు. దర్యాప్తు చట్ట పరిధిలో కొనసాగుతుంది. ఈ దర్యాప్తు కు ఆటంకం కలిగించేలా కొన్ని మీడియా కధనాలు దర్యాప్తు అధికారులు వెలువరించినట్లు వస్తున్నాయి ఇది స రైంది కాద’ని వెస్ట్ జోన్ డిసిపి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఐబి విభాగం రాష్ట్ర భద్రత, ప్ర జల రక్షణ కోసం మావోయిస్టు, అసాంఘిక శక్తులను అరికట్టెందుకు పని చేస్తుంది. దాని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కోర్టు పరిధిలో దర్యాప్తు చేస్తున్నామని డిసిపిపేర్కొన్నారు. ఈ క్రమంలో మీడి యా ఊహజానీత కథనాలతో ప్రజలను అయోమయంలో పడేయొద్దని డిసిపి విజ్ఞప్తి చేశారు. దర్యా ప్తు పురోగతికి సంబంధించి వివరాలను పత్రిక ప్రకటనల ద్వారా వివరిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News