Friday, January 3, 2025

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా, బాసర ట్రిపుల్ ఐటి (ఆర్‌జియుకెటి)లో విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం (పియుసి=–2) చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమి త్తం ఈ నెల 12న మళ్లీ యూనివర్సిటీకి వచ్చాడు. హాజరు శాతం తక్కువ గా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. ఈ విషయా న్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని ఇంటికి తీ సుకెళ్లాలని చెప్పాడు. అయితే వారు రాకపోవడంతో హాస్టల్‌లోనే ఉన్నాడు.

తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఉరేసుకున్నాడు. ఆ తర్వాత విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, బండారుపల్లి. విద్యార్థి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News