Thursday, December 19, 2024

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం భద్రాద్రి: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం జరిగింది. మధాహ్నం 12.30 వరకు స్వామవారి కల్యాణ క్రతువు కొనసాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి పురవీధులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తజనం భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. గోదావరి జలాలతో కల్యాణ వేదికను శుద్ధి చేశారు. భద్రాద్రిలో శ్రీసీతారాముల తిరుకల్యాణ మహోత్సవంలో మంత్రులు పొంగుటేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, కొండా సురేఖ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News