Thursday, November 14, 2024

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు మరోసారి వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ఈ కేసులో తమ వాదన ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరడంతో విచారణను ధర్మాసనం జూలై 24కు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును నిందితునిగా చేయాలని, దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వైఎస్సార్ సిపి ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణా రెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.

విచారణ సెలవుల తర్వాత జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. అభియోగపత్రంలో చంద్రబాబు పేరును ఏసిబి 22 సార్లు ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరును నిందితుడిగా తెలంగాణ ఏసిబి చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎంఎల్ఏ ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపేందుకు, ఎంఎల్ఏలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని అభియోగం. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసిబి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

కేసు విచారణ అనంతరం ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయారని మండిపడ్డారు. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, అయితే ఇదే చివరి అవకాశం అని, మళ్ళీ వాయిదాలు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోరుట జూలై 24కు కేసును వాయిదా వేసిందని వెల్లడించారు. నాడు ఒక ఓటుకు ఐదు కోట్ల రూపాయాలకు బేరమాడిని ఆడియో బయటపడింది, రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడడం బట్టబయలయింది. ఈ కేసు ముందుకు పోకపోవడానికి కారణం వ్యవస్థను మేనేజ్ చేయడమనని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News