- Advertisement -
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన శ్రీరామ నవమి ఘర్షణలు బిజెపి రెచ్చగొట్టినవేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పైగా ఆ ఘర్షణలు ‘ప్రీప్లాన్ఢ్’ గా రూపొందించనవేనని ఆమె ఆరోపించారు.
రాయ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆమె ఘర్షణలకు ముందు ఓ పోలీస్ ఆఫీసర్ ను కూడా తొలగించారని పేర్కొన్నారు. ముర్షీదాబాద్ లో బిజెపి గూండాలు పోలీసులను సైతం ఉతికిపారేశారని అన్నారు.
ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సువేందు అధికారి ఘర్షణలకు కారణం మమతా బెనర్జీయే అన్నారు. ముర్షీదాబాద్ లో గురువారం ఊరేగింపు జరుగుతుండగా ఘర్షణలను మమతా బెనర్జీయే ప్రోత్సహించారని పేర్కొన్నారు. మమతా బెనర్జీ రెచ్చగొట్టే ప్రసంగాలే ఘర్షణలకు కారణమని కూడా ఆయన ఆరోపించారు.
- Advertisement -