హైదరాబాద్: వేసవిలో చల్లదనం అందించే టిఎస్ ఆర్టీసి లహరి ఎసి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకుని చిల్ కావాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సూచించారు. హైటెక్ హంగులతో రూపొందించిన లహరి ఎసి స్లీపర్, ఎసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను అర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని సజ్జనార్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. లహరి బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజామాబాద్, నాగ్ పూర్, షిర్డీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
లహరి-అమ్మఒడి అనుభూతి పేరుతో రూపొందించబడిన లహరి సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline in వెబ్ సైట్ ని సంప్రదించాలని ఆయన సూచించారు. మరోవైపు వరంగల్ నుంచి నిజమాబాద్ రూట్‌లలో కూడా ఈ ఎసి సర్వీసులు నడిపించాలంటూ నెటిజన్లు కోరారు. లహరి బస్సులు బాగున్నాయని, కానీ బస్సుల్లో స్పేస్ తక్కువగా ఉండటంతో కొంత అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
లహరి-ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు💙
వేసవిలో చల్లదనం అందించే #TSRTC లహరి- ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకోండి. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజమాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర… pic.twitter.com/c0wJSkggbs
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 18, 2024