Sunday, December 22, 2024

సిఎం విజయన్ కమ్యూనిస్టు కాదు

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీతో కేరళ సిఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయన్నారు. కేరళ సిఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదన్నారు.

పైకి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్, కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని ఆయన అన్నారు. మతతత్వ బిజెపితో కలిసి విజయన్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వాయనాడ్‌లో బిజెపి అభ్యర్థి సురేంద్రన్‌కు కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. సొంత పార్టీ సిపిఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News