దర్శకుడు సాహిత్ మోత్ఖూరి మూడవ ప్రాజెక్ట్ ‘పొట్టెల్’లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ ను విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ “పొట్టెల్ టీజర్ చూసినప్పుడు సాహిత్ తన ఆనుకున్న కథను తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను”అని తెలిపారు. హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ “ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. గొప్ప స్ఫూర్తినిచ్చే సినిమా ఇది”అని పేర్కొన్నారు.
అనన్య నాగళ్ల మాట్లాడుతూ దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా టీజర్ ఉందని అన్నారు. దర్శకుడు సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ పొట్టెల్ సినిమా అందరినీ ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిశాంక్, అజయ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.