- Advertisement -
కుప్పం(చిత్తూరు): తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఈ రోజు దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు మధ్యాహ్నం 01.27 గంటలకు కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు చంద్రబాబు నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.
నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ముందు భువనేశ్వరి స్థానిక వరద రాజస్వామి ఆలయంలో వాటిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవించారు. తర్వాత ఆమె లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో కూడా ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నామినేషన్ తతంగానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు.
- Advertisement -