Saturday, November 16, 2024

శిల్పా శెట్టికి త్వరలో ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -
బిట్ కాయిన్ల కుంభకోణంలో రూ.97.79 కోట్ల ఆస్తుల జప్తు

ముంబై: బిట్‌కాయిన్ కుంభకోణంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసే అవకాశం ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ కుంభకోణంలో కొంత భాగం..దాదాపు రూ. 150 కోట్లలు విలువచేసే 285 బిట్‌కాయిన్లు శిల్పా శెట్టికి వెళ్లాయని తెలుస్తోంది. పిఎంఎల్‌ఎ నిబంధనల కింద కేసు నమోదు చేసిన ఇడి అధికారులు శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల కోట్ల విలువైన స్థిర చరాస్తులను గురువారం జప్తూ చేశారు. కాగా..రూ. 7,000 కోట్ల మేరకు ఈ బిట్‌కాయిన్ సాంజీ కుంభకోణం జరిగినట్లు వర్గాలు తెలిపాయి.

ముంబైలోని జుహులో శిల్పా శెట్టి పేరిట ఉన్న ఫ్లాట్, పుణెలోని ఇల్లు, రాజ్ కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను ఇడి గురువారం జప్తు చేసింది. వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పైన, దాని ప్రమోటర్లు అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరులపైన మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి తన దర్యాప్తు ప్రారంభించింది.

బిట్‌కాయిన్ల రూపంలో నెలకు 10 శాతం చొప్పున వాపసు చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల నుంచి రూ. 6,600 కోట్ల మేరకు విలువైన బిట్‌కాయిన్ల రూపంలో భారీ స్థాయిలో నినిధులను నిందితులు వసూలు చేశారని ఇడి కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి 285 బట్‌కాయిన్లను రాజ్ కుంద్రా అందుకున్నట్లు ఇడి దర్యాప్తులో తేలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News