Monday, December 23, 2024

ఘనంగా చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఏపిలోని రాయదుర్గం నియోజవకర్గం కనేకల్లులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి పార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు ఈ మేరకు కేక్ కట్ చేసి ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు అందజేశారు. వేద పండితులు, ముస్లిం మత పెద్దలు, పాస్టర్లు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. కాగా చంద్రబాబు నాయుడు 74వ పుట్టిన రోజు కార్యక్రమాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా శనివారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ మనందరికీ ఆదర్శ నాయకుడు ఎన్‌టిఆర్ అయితే.. ఆయన ఆశయాలను, రాజకీయ పార్టీని, పాలనను భావితరాలకు అందజేస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు అన్నారు.

మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆశయాలను చంద్రబాబు తన పాలనలో వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లారన్నారు. రాజకీయ నాయకులు వేరు, రాజనీతిజ్ఞులు వేరు అని వచ్చే ఎన్నికల కొరకు ఆలోచించే వారు రాజకీయ నాయకులు అయితే భావితరాల కోసం ప్రణాళికలు రచించి అమలు చేసే వారు రాజనీతిజ్ఞులు అని పేర్కొన్నారు. విద్య, మహిళా సాధికారత, పాలనలో మార్పులు వంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు సమాజంలోని అన్ని వర్గాలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా పాలన చేశారన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా మొట్టమొదటిసారిగా అధికార యంత్రాంగమంతా గ్రామాలకు వెళ్లి ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని శాసనసభలో చర్చించి, నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పర్యవేక్షణ ప్రజలదే. 5 లక్షల మహిళా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తద్వారా మహిళా సాధికారతకు దోహదపడ్డారన్నారు.

విద్యను అందిస్తే ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడతారనే ఉద్దేశంతో అందరికీ విద్య, బ్యాంక్ టు స్కూల్, అక్షర కిరణం వంటి కార్యక్రమాలను 2020 విజన్ ద్వారా అమలు చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కృషి చేశారన్నారు. నీరు, మీరు, వనరక్షణ సమితుల ద్వారా నీరు, అడవులు వంటి సహజ వనరులను కాపాడారన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో చెట్టు నీరు కార్యక్రమాన్ని అమలు చేశారని బక్కని నర్సింహులు గుర్తు చేశారు. కాగా చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుక కార్యక్రమంలో పార్టీ జాతీయ క్రమ శిక్షణ కమిటీ సభ్యులు, బంటు వెంకటేశ్వర్లు , జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్, టిడిపి మీడియా కమిటీ ఛైర్మన్ తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి, గజేంద్రగౌడ్ , ముంజా వెంకట్‌రాజం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News