Friday, January 10, 2025

ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: సాయంత్రం సమయంలో అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండగా ప్రహరీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జున నగర్ ప్రాంతంలో ఓ పాత గోడ కూలిపోవడంతో చిన్నారితో సహ నలుగురు చనిపోయారు. ఓ పది మంది గోడ పక్కన కూర్చొని ముచ్చటపెడుతుండగా ఒక్కసారిగా వారిపై గోడ కూలింది. గోడ బలంగా ఉండడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో నలుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఆరు బయట కూర్చున్న పాపానికి గోడ ప్రాణం తీసిందని నెటిజన్లు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News