హైదరాబాద్: ముస్లింల ప్రవక్త ముహమ్మద్ పై దైవ దూషణ పోస్ట్ పెట్టినందుకు ఓ వ్యక్తిపై జవహర్ నగర్ పోలీసులు కేసు పెట్టారు. స్థానిక ముస్లిం యువత ఫిర్యాదు చేశాక జవహర్ నగర్ కు చెందని శ్రవణ్ కుమార్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. ఇండియన్ పినల్ కోడ్ 295ఏ, 504 సెక్షన్ ల కింద శ్రవణ్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదిలావుండగా మజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరపాలని కోరారు. కొందరు కావాలనే ప్రవక్త ముహమ్మద్ పై పోస్ట్ పెట్టి మత కలహాలు పుట్టించాలని చూస్తున్నారని కూడా అన్నారు.
వచ్చే నెల తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఇలాంటి కేసు చోటుచేసుకుందన్నది గమనార్హం. గతంలో బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి మత ఉద్రిక్తతలు రేపడానికి ప్రయత్నించారన్నది ఇక్కడ గ్రహించాలి. స్టాండింగ్ కామెడియన్ మునవర్ ఫారూఖీ పర్ఫామెన్స్ కు ముందు రాజా సింగ్ కూడా అనుచిత పోస్ట్ పెట్టడంతో అరెస్టయి మూడు నెలలు జైలుకు వెళ్లారు. అంతేకాక పార్టీ నుంచి కూడా సస్పెండ్ కు గురయ్యారని గ్రహించాలి.