Monday, December 23, 2024

మోడీ హయాంలో రైలు ప్రయాణం నరకంగా మారింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

మోడీ హయాంలో రైలు ప్రయాణం నరకంగా మారింది
రైల్వేల ‘అసమర్థత’ నిరూపణకు బిజెపి ప్రభుత్వం యత్నం
‘మిత్రులకు’ రైల్వే విక్రయానికి సాకు కావచ్చు
కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణ
న్యూఢిల్లీ: రైల్వేలను తన ‘మిత్రులకు’ విక్రయించేందుకు ఒక సాకుగా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఆ శాఖకు ‘సమర్థత లేద’ని నిరూపించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. సామాన్యుని రవాణా సాధనాన్ని కాపాడేందుకు మోడీ ప్రభుత్వాన్ని తొలగించవలసిందిగా ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై విమర్శ కోసం రాహుల్ గాంధీ ఒక రైలులో కింద, టాయిలెట్లలో కూర్చొని ప్రయాణిస్తున్న వీడియోను ‘ఎక్స్’ పోస్ట్‌లో పంచుకున్నారు. ‘నరేంద్ర మోడీ పాలనలో రైలు ప్రయాణం నరకంగా మారింది. ప్రతి కేటగరీ ప్రయాణికులను మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. సామాన్యుల రైళ్లలో నుంచి జనరల్ బోగీల కుదింపు ద్వారా ‘ఉన్నత వర్గాల రైళ్ల’ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అని రాహుల్ విమర్శించారు.

కన్ఫర్మేషన్ టిక్కెట్లు ఉన్నప్పటికీ జనం తమ సీట్లలో ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. సామాన్యులు టాయిలెట్‌లో లేదా బోగీలో కింద కూర్చొని ప్రయాణించవలసి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘తన విధానాలతో రైల్వేలను బలహీనపరచి ‘అసమర్థ’ సంస్థగా నిరూపించాలని మోడీ ప్రభుత్వం కోరుకుంటోంది. దాని వల్ల రైల్వేలను తమ మిత్రులకు విక్రయించేందుకు ఒక సాకు ప్రభుత్వానికి దొరుకుతుంది’ అని రాహుల్ ఆరోపించారు. సామాన్యుని రవాణా వాహనాన్ని కాపాడాలంటే రైల్వేల నిర్వహణలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని తొలగింవలసి ఉంటుందని రాహుల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News