Saturday, November 23, 2024

మణిపూర్‌లో రీ పోలింగ్: చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్ ఇన్నర్ లోక్‌సభ నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ జరుగుతుందని చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్ ప్రకటించారు. ఈ పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 19న జరిగిన పోలింగ్ చెల్లదని ప్రకటించారు. రీపోలింగ్ నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో ఖురాయ్ నియోజక వర్గానికి చెందిన మొయిరాంగ్‌కంపు సాజేబ్, థోంగమ్ లీకై, క్షేత్రీగావ్‌లో నాలుగు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని కొంతౌజామ్‌లో ఒకటి ఉన్నాయి. మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలైన ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ లకు శుక్రవారం మొదటిదశ ఓటింగ్ జరిగింది.

72 శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఆ క్రమం లోనే రిగ్గింగ్, బూత్ స్వాధీనం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. 47 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మణిపూర్ విభాగం అధ్యక్షుడు కె. మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం లోని 36 , ఔటర్ మణిపూర్ లోని 11 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కుల సంఘర్షణతో ప్రభావితమైన మణిపూర్ లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో కాల్పులు, బెదిరింపులు, ఇవిఎంలను ధ్వంసం చేయడం, పోలింగ్ స్టేషన్లను స్వాధీనం చేసుకోవడం వంటి ఆరోపణలు వెలుగు లోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News