- Advertisement -
అత్యంత సాధారణ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరని, ఆయన అందరితో కలిసి కమర్షియల్ విమానంలోనే ప్రయాణిస్తున్నారని చెబుతూ విమానంలో ఆయన పక్కన కూర్చొని దిగిన ఫొటోను ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రముఖ పాప్ సింగర్ స్మిత, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని విమానంలో కలిసినట్లు ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు.
రేవంత్ రెడ్డితో కలిసిన ఫొటోను అభిమానులతో స్మిత పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత ఎవరిని ఎక్కడ కలిశానో చూడండి అంటూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిని పలు రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు.
- Advertisement -