Monday, December 23, 2024

విద్యార్థిని పరీక్ష కేంద్రంలో దించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థి ఆటోడ్రైవర్ తప్పిందం వల్ల వేరే పరీక్ష కేంద్రానికి రావడంతో గమనించిన నారాయణగూడ పోలీసులు పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా చేశారు. నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లికి చెందిన వైష్ణవి అనే అమ్మాయి టిఎస్‌ఆర్‌జెసి పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు అమ్మమ్మతో కలిసి వచ్చింది. ఆటో మాట్లాడుకుని పరీక్ష కేంద్రానికి వచ్చింది, కాని ఆటో డ్రైవర్ పటేల్ నగర్‌లోని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ సిపిఎల్ రోడ్డులో పరీక్ష రాయాల్సి ఉంది.

కానీ ఆట్రో డ్రైవర్ నారాయణగూడ పోలీస్టేషన్ పరిధిలోని గురునానక్ హై స్కూల్ వద్దకు వైష్ణవి 9.45 నిమిషాలకు వచ్చింది. పరీక్ష కేంద్రం చూసుకునే సరికి ఇక్కడ కాదని తెలిసింది. దీంతో అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ కంగారుపడుతుంటే అటువైపు వెళ్తున్న నారాయణగూడ పెట్రోలింగ్ పోలీసులు వారిని 15 నిమిషాల్లో నారాయణగూడ విట్టల్ వాడి నుండి అంబర్పేట సిపిఎల్‌లోని ఎగ్జామ్స్ సెంటర్‌కు చేర్చారు. పరీక్ష కేంద్రం గేట్ రెండు నిమిషాల్లో మూసివేస్తారనే సమయంలో తీసుకొని వెళ్లి లోపలికి పంపించారు. దీంతో వైష్ణవి పరీక్ష రాసింది, బయటికి వచ్చిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News