- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ బిగ్ మూవీలో అందాల తార కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో దియేటర్లలో విడుదల కానుంది. ఇక వారం రోజుల పాటు జరగనున్న కొత్త షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్రతో పాటు ఇతర నటులు కూడా పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Advertisement -