Monday, November 25, 2024

అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సిఎం అంటున్నారు: మహేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరువు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని బిజెపి ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, రైతులు పండించి ధాన్యానికి గిట్టుబాటు ధర, బోనస్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పారు. రైతులకు ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తన తరువాత సిఎం అని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్తాడని అర్థమైనట్టుందని మహేశ్వర్ రెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఎవరూ రేవంత్ రెడ్డితో టచ్‌లో లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News