అమరావతి: ఈ ఎన్నికలలో కాపులను మళ్లీ మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నాడని నటుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు. సోమవారం పవన్ కల్యాణ్, చంద్రబాబుపై పోసాని విమర్శలు గుప్పించారు. పవన్‌కు డబ్బు అధికారమే కావాలని, కాపులను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టారని, గతంలో చంద్రబాబును వెన్నుపోటుదారుడని పవన్ అనలేదా?, లోకేష్‌ను తిండిబోతు అని అనలేదా? అని అడిగారు. సిఎం స్థాయి అనే చెప్పుకునే వ్యక్తి, బాబు కాళ్ల దగ్గర పవన్ పడటం మంచిది కాదని పోసాని హితువు పలికారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ కోసం కాపులు ఆస్తులు అమ్ముకున్నారని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు చిరు అమ్ముకొని కేంద్రమంత్రి పదవి తీసుకున్నారని, గతంలో చిరంజీవి కూడా కాపుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కు అమ్మేశాడని, అప్పుడు కాపుల మనోభావాలను చిరంజీవి కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతాడని, సిఎం జగన్‌ను చంపడానికైనా బాబు వెనుకాడడని, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను కూడా చంపేందుకు కుట్ర పన్నారని పోసాని ఆరోపణలు చేశారు.
కాపులను చంద్రబాబు దగ్గర పవన్ తాకట్టు పెట్టారు: పోసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -