Saturday, January 18, 2025

రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీకి హవాతో తెలంగాణలో ని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్‌స్వీ ప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గో యల్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జి ల్లా, చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా రా జేంద్రనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి గో యల్ ప్రసంగిస్తూ.. బిజెపి అండగా అన్ని వర్గాలు ఉన్నాయని, దేశంలో 400కు పైగా ఎంపి స్థా నా ల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కా వడం ఖాయమని విశ్వాసం వ్య క్తం చేశారు. ప్రస్తుతం జరుగుతు న్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించేవని, ప్రజలం తా దేశం కోసం మోడీ నాయకత్వా న్నిబలపరుస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారమే లక్షంగా సిద్ధాంతాలను గాలికి వదిలేసి ఇండియా కూటమి పేరుతో ఒక్కటైనా జనం మాత్రం వారిని విశ్వసించడం లేదని అన్నారు.

కూటమి పేరుతో ఒక్కటైనవారు ఆయా రాష్ట్రాలలో మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చూస్తున్న జనం కామెడీగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కేరళలో సిపిఎంను, పశ్చిమ బెంగాలలో తృణమూల్‌ను తిడుతూ ఢిల్లీలో మాత్రం కూటమి అంటూ దోస్తీ చేస్తారని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ సమర్థవంతమైన విధానాలతో అంతర్జాతీయంగా భారత్ అగ్రభాగం వైపు సాగుతోందన్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని అన్నారు. చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించనున్నారని అన్నారు. కాగా ప్రజల అండతో చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని చేవెళ్ల బిజెపి ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బిజెపి ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఎంపి లక్ష్మణ్, మాజీ ఎంఎల్‌ఎ కె.ఎస్.రత్నం, పార్టీ మహేశ్వరం ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్‌తో కలిసి కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News