గాలిలో ఉండగానే రెండు నేవీ హెలిక్యాప్టర్లు ఢీకొని కూలిపోయాయి. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ ఈవెంట్ కోసం రిహార్సల్ చేస్తుండగా రెండు నేవీ హెలీక్యాప్టర్ల రెక్కలు ఒకదానికొకటి తాకడంతో కూప్పకూలిపోయాయని అధికారులు వెల్లడించారు. మలేషియా పట్టణం లుముట్ సమీపంలోని నౌకాదళ స్థావరంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెండు హెలిక్యాప్టర్లు ఢీకొన్న అనంతరం.. ఒకటి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడిపోగా..మరోకొటి రన్నింగ్ ట్రాక్‌పై కూలిపోయింది.
HOM (M503-3), Fennec (M502-6) మోడల్స్ హెలికాప్టర్లు ఉదయం 9.32 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢీకొని కూలిపోయాయని రాయల్ మలేషియన్ నేవీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ 90వ వార్షికోత్సవ కార్యక్రమానికి హెలికాప్టర్లు రిహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. HOM (M503-3) హెలికాప్టర్‌లో ఏడుగురు, ఫెన్నెక్ (M502-6)లో ముగ్గురు వ్యక్తులు సంఘటనాస్థలంలో మరణించినట్లు నిర్ధారించింది. మృతదేహాలను గుర్తించేందుకు లుముట్ రాయల్ మలేషియా నేవీ బేస్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు దేశ నౌకాదళం తెలిపింది.
BREAKING: 🇲🇾 2 military helicopters crash after mid-air collision in Malaysia, killing all 10 people on board pic.twitter.com/ckiEaqnd4R
— Megatron (@Megatron_ron) April 23, 2024