- Advertisement -
హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ ‘నాని కార్స్’లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అనంతరం గ్యారేజీ మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్నా 20 కార్లు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే.. అప్పిటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు గ్యారేజీ ఓనర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -