Monday, December 23, 2024

పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్మాణంలోని వంతెన

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య మానేరు వాగుపై ఈ వంతెన నిర్మాణిస్తున్నారు.  బిఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016లో పనులు ప్రారంబించినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

వంతెన నిర్మాణ చేపడుతుండడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్గంలో స్తానికులు రాకపోకలు సాగిస్తున్నారు. చాలా రోజులుగా నిర్మాణం పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు రావడంతో వంతెన గట్టర్లు కూలిపోయాయి. అర్థరాత్రి సమయంలో వంతెన కూలడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా 8ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా పనులు నత్తనడకన సాగుతుండటంపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News