- Advertisement -
రాజకీయ నాయకులు పార్టీలు మారడంపై, ఉచిత హామిలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం రాజకీయ నాయకుల్లో విలువలు లేకుండా పోయాయన్నారు. నేతలు పార్టీలు మారడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిందన్నారు.
మంగళవారం ఢిల్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. “పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరోచ్చు.. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదు. నేను ఉచితాలకు వ్యతిరేకం.. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలి. రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలి. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవం.. ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలి” అని అన్నారు.
- Advertisement -